News September 24, 2025
జగిత్యాల: ఎకానమిక్ సపోర్ట్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం

JGTL జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 24-25 ఆర్థిక సంవత్సరానికి ఎకానమిక్ సపోర్ట్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. ఫకీర్, దూదేకుల, దుర్బల ముస్లిం కమ్యూనిటీ వర్గాల వారు అర్హులన్నారు. రూ.1 లక్ష గల మోపెడ్లు, బైక్‌లు, ఈ-బైక్‌లు లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా OCT 6 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News September 24, 2025
మైలార్‌దేవ్‌పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్‌ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్ అమీర్, మహమ్మద్ సోయల్ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్‌ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.
News September 24, 2025
జనగామ: 76 వేల మందికి రూ.500లకే వంట గ్యాస్..!

నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఇప్పటివరకు 76,430 మంది వినియోగదారులకు 500లకే వంట గ్యాస్ సరఫరా చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన నేపథ్యంలో వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉంది.
News September 24, 2025
108, 102 సేవలను వినియోగించుకోవాలి: DMHO

ప్రజలు అత్యవసర వైద్య సేవల నిమిత్తం 108, 102 వాహనాలను వినియోగించుకోవాలని DMHO అప్పయ్య సూచించారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆయన సమీక్షించారు. జిల్లాలో 17 (108), 7(102) వాహనాలు
ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలతో పాటు గర్భిణులు, కార్డియాక్, పాయిజన్ , స్ట్రోక్ ,శ్వాస సమస్యలు, తీవ్రమైన జ్వరం, ఫిట్స్ అపస్మారక స్థితిలో 108 సేవలను వినియోగించుకోవచ్చన్నారు.