News July 10, 2025

జగిత్యాల: ఎన్నికలకు సిద్ధం కండి: RS ప్రవీణ్ కుమార్

image

BRS నేతలు, కార్యకర్తలు జోష్ పెంచాలని, ప్రతి గ్రామంలో ముమ్మరంగా పర్యటించాలని, ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు RS ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో BRS కొత్త ఆఫీస్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, MLA కల్వకుంట్ల సంజయ్ కుమార్, BRS నాయకులు పాల్గొన్నారు.

Similar News

News July 11, 2025

100 ఏళ్లైనా AI అలా చేయలేదు: బిల్ గేట్స్

image

AIపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రోగ్రామింగ్‌లో AI మనకు అసిస్టెంట్‌గా వ్యవహరిస్తుంది. డీబగ్గింగ్‌ లాంటి విషయాల్లో హెల్ప్ చేస్తుంది. ప్రోగ్రామింగ్‌లో సృజనాత్మకంగా వ్యవహరించాలి, ఊహాత్మక ఆలోచన, పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుబాటు అవసరం వాటిని యంత్రాలు చేయలేవు. అందుకే, ఎప్పటికీ AI డెవలప్పర్లకు పూర్తి ప్రత్యామ్నాయం కాదు’ అని వ్యాఖ్యానించారు.

News July 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 11, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.28 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.15 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 11, 2025

నాగార్జునసాగర్‌లో నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువ జల విద్యుత్ కేంద్రంలో నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నారు. సాగర్ ప్రధాన పవర్ హౌస్, ఎడమ కాలువ పవర్ హౌస్, అక్కంపల్లి రిజర్వాయర్‌ను హైడల్ డైరెక్టర్ బాలరాజు ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ ఏడాది 163 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పాదన చేయాల్సి ఉండగా అవసరానికి అనుగుణంగా నిర్దిష్ట ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.