News October 7, 2025
జగిత్యాల: ఎన్నికల్లో పోటీ చేయోద్దంటూ బైక్ ధ్వంసం

గుండంపల్లిలో ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న అభ్యర్థికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. పోటీ చేయవద్దని హెచ్చరిస్తూ అతడి పొలం వద్ద పార్క్ చేసిన బైక్‌ను దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అభ్యర్థి తనపై ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిచే అవకాశం ఉండటం వల్లే బెదిరిస్తున్నారని, అధికారులు తక్షణమే చొరవ తీసుకుని రక్షణ కల్పించాలని బాధితుడు కోరారు.
Similar News
News October 7, 2025
హిమాచల్‌ప్రదేశ్ ప్రమాదం.. 18 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడిన <<17942357>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 18కి చేరింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఇప్పటివరకు ముగ్గురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున PM పరిహారం ప్రకటించారు.
News October 7, 2025
ఈ విషయంలో Gen Zలు చాలా బెటర్!

యంగర్ జనరేషన్స్‌లో ఆల్కహాల్ అలవాటు తక్కువేనని ఓ స్టడీ తెలిపింది. ముఖ్యంగా Gen Z(1997-2012)లు బేబీ బూమర్లు(1946-64), మిలీనియల్స్(1981-96)తో పోల్చితే మద్యం తక్కువగా సేవిస్తున్నారని ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ యూనివర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు. 2 దశాబ్దాల్లోని 23 వేల మంది డేటాను విశ్లేషించారు. బేబీ బూమర్స్ కన్నా మిలీనియల్స్ సగటున తక్కువే తాగినా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నట్లు గుర్తించారు.
News October 7, 2025
నల్గొండ: మైనర్ హత్యాచారం.. పోక్సో కేసు నమోదు

నల్గొండ మండలంలో బాలిక హత్యాచార ఘటనపై పోక్సో కేసు నమోదైంది. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు తక్షణమే నిందితుడు కృష్ణతో పాటు అతని స్నేహితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.