News December 14, 2025

జగిత్యాల: ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీల నిషేధం

image

జగిత్యాల జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసర గుంపులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.మూడవ విడత పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News December 15, 2025

యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

News December 15, 2025

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: డీఈఓ

image

కంది మండలం ఉత్తరపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. పాఠశాలలో బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థుల చేత పాఠ్యాంశాలను చదివించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు.

News December 15, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

✒PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు:ఎస్పీలు
✒NGKL: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
✒PHASE-3 పూర్తయ్యే వరకు MCC అమల్లోనే: ఎస్పీ
✒100% ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి:కలెక్టర్లు
✒PHASE-3 ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్లు
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒నూతన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యేలు
✒పోలింగ్ సామగ్రి పంపిణీ: కలెక్టర్లు