News December 2, 2025
జగిత్యాల: ‘ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలనే రాండమైజేషన్’

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది 2వ రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో జనరల్ అబ్జర్వర్ రమేష్ తో కలిసి నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో రాండమైజేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నమన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.
Similar News
News March 9, 2026
ఇరాన్‌పై దాడులు.. ఆ ఒక్క దీవిని US టచ్ చేయట్లేదు!

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భీకర దాడులకు పాల్పడుతున్నా ఆ దేశంలోని ఖర్గ్ దీవిని మాత్రం టచ్ చేయట్లేదు. ఇరాన్ తీరానికి 25KM దూరంలో ఉన్న దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఒక్కరోజే ఇక్కడ 7M బ్యారెళ్ల చమురును భద్రపరచొచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90%. దీని మీద దాడి చేస్తే ఇరాన్‌కే కాకుండా గల్ఫ్ మొత్తానికి భారీ నష్టం వాటిల్లుతుంది. చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు భారీగా పెరుగుతాయి.
News March 9, 2026
కొత్త బురుజులో సీఎం చంద్రబాబు ప్రజా సభ

డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. తొలుత రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దనరెడ్డి, ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
News March 9, 2026
విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్‌ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.


