News December 2, 2025
జగిత్యాల: ఎన్నికల విధులపై సూక్ష్మ పరిశీలకులకు మార్గనిర్దేశం

జగిత్యాల కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.రమేష్ మాట్లాడుతూ.. సూక్ష్మ పరిశీలకుల పాత్ర పోలింగ్‌లో కీలకమని అన్నారు. సాధారణ పరిశీలకుడి ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు. మాక్ పోలింగ్, ఓటర్ల గుర్తింపు, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాలన్నారు.
Similar News
News April 13, 2026
కంగ్టి గిరిజన గురుకులంలో 100% ఉత్తీర్ణత

కంగ్టిలోని గిరిజన రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 17 మంది, ద్వితీయ సంవత్సరంలో 20 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందరూ పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. సెకండియర్‌లో బేగరి ఈశ్వర్ 928 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.
News April 13, 2026
హైదరాబాద్: 12 గంటల్లోపే వాటర్ ట్యాంకర్ డెలివరీ

ట్యాంకర్ బుకింగ్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మణికొండ, బంజారాహిల్స్, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, రాత్రి వేళల్లో కూడా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని జూమ్ సమావేశంలో అధికారులకు MD సూచించారు.
News April 13, 2026
పతనమైన ఉల్లి ధరలు.. రైతుల కన్నీరు

కొత్తపల్లి మండల పరిధిలో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా రూ.300కి పడిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంట కోతకు పెట్టే ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన ఉల్లిని అమ్మేందుకు మార్కెట్‌లో సరైన ధర లేక పెట్టుబడులు కూడా వృథా అవుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


