News December 21, 2025
జగిత్యాల: ఎమ్మెల్యే నివాసంలో వైద్యాధికారుల సమావేశం

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎ.శ్రీనివాస్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డిప్యూటీ DMHO) డా.ఎన్.శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు, ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, కొనసాగుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు.
Similar News
News December 24, 2025
జాతీయ సైన్స్ ఫెయిర్‌కు విజయనగరం విద్యార్థుల ఎంపిక

చీపురుపల్లి బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు జాతీయ స్థాయితో పాటు దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యాయి. విద్యార్థుల విభాగంలో “క్రాప్ డాక్టర్” ప్రాజెక్ట్ ఎంపికైంది. సుస్థిర వ్యవసాయ లక్ష్యంతో ఏఐ ఆధారిత మొబైల్ యాప్ ద్వారా రైతులకు పంట సమస్యలపై మార్గదర్శకత్వం అందించనున్నారు. పొట్టా స్వప్న రూపొందించిన “గ్రీన్ ల్యాబ్” ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి చేరింది.
News December 24, 2025
ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు: ఈ ఏడాది 41,745 కాల్స్‌కు స్పందన..!

కామారెడ్డి జిల్లాలో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో పోలీసులు ‘డైల్-100’ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 41,745 కాల్స్ రాగా, స్పందించి బాధితులకు అండగా నిలిచారు. వీటిలో తీవ్రతను బట్టి 253 కేసులు నమోదు చేయగా, మిగిలిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించారు. ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ‘డైల్-100’కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని SP రాజేష్ చంద్ర సూచించారు.
News December 24, 2025
బిక్కనూర్: Way2News ఎఫెక్ట్.. రైతులకు యూరియా పంపిణీ

బిక్కనూర్ మండలం కాచాపూర్‌లో రైతుల ఇబ్బందులపై <<18656388>>‘మళ్లీ రైతులకు తప్పని కష్టాలు’<<>> శీర్షికన Way2Newsలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామంలో రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేశామని కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. రబీ సీజన్ నేపథ్యంలో గ్రామానికి యూరియా పంపించగా రైతులు వచ్చారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేశామన్నారు.


