News February 24, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఉద్యోగులకు ప్రత్యేకసెలవు: కలెక్టర్

ఈనెల 27న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్‌మెంట్ అథారిటీల్లో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటుహక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులకు సైతం ఓటుహక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలన్నారు.
Similar News
News February 24, 2025
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

శాసన మండలి ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిబంధనలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ నెల 27న జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించి నివేదికలను త్వరగా అందజేయాలన్నారు.
News February 24, 2025
WFH.. ఇక ఉండదా?

కరోనా టైంలో ఎక్కువగా వినిపించిన పేరు వర్క్ ఫ్రం హోం(WFH). కొన్ని కీలక రంగాలు తప్ప చాలా మంది ఉద్యోగులు ఈ విధానంలో పనిచేశారు. ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. చాలా కంపెనీలు WFH మోడ్‌ను ఎత్తివేస్తూ, ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో దేశంలో WFH పూర్తిగా ఉండదా? హైబ్రిడ్ మోడల్ ఉద్యోగాలు ఉంటాయా? అనే చర్చ మొదలైంది. WFH ఉద్యోగాలపై మీ అభిప్రాయం ఏంటి?
News February 24, 2025
పెండింగ్ కేసులను పరిష్కరించాలి: అనకాపల్లి ఎస్పీ

నిర్దిష్ట ప్రణాళికతో పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చార్జిషీట్లు, సమన్లు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు.