News February 6, 2025

జగిత్యాల: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీ.ఎస్ లత బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఫర్నిచర్, విద్యుత్తు ఏర్పాట్లు, నీటి వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌసూర్ రెహమాన్ ఉన్నారు.

Similar News

News April 4, 2026

ఉమ్మడి ఆదిలాబాద్‌కు వర్ష సూచన..?

image

రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత శుక్రవారం నమోదైందని వెల్లడించారు.

News April 4, 2026

నర్సంపేట కేంద్రంగా స్కానింగ్ దందా?

image

గర్భిణులకు పుట్టబోయేది పాప, బాబునా? అని చెప్పేందుకు నర్సంపేట అడ్డాగా మారినట్లు పోలీసులు గుర్తించారు. పున్నేలులో జరిగిన హత్యలకు కారణం కూడా అక్కడి వ్యక్తేనని తెలుస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధమని తెలిసినా, వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఈ దందా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News April 4, 2026

ఎల్లోతో ప్రేమలో పడిపోయా.. మీనా ఫొటో వైరల్

image

తొలిసారి ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించినట్లు నటి మీనా తెలిపారు. నిన్న CSK-PBKS మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో దిగిన ఫొటోను Xలో షేర్ చేశారు. ‘తొలిసారి లైవ్ చూశా. ఎల్లో(CSK)తో లవ్‌లో పడిపోయా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఎప్పటికీ తరగని అందం ఆమెదని కొందరు కామెంట్ చేయగా, CSKలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటూ మరికొందరు ఆరా తీశారు. 90sలో వెలుగు వెలిగిన మీనా సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘దృశ్యం’తో అదరగొట్టారు.