News February 2, 2026

జగిత్యాల: ఎస్పీగా శేషాద్రిని రెడ్డి పదోన్నతి

image

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘పిప్పింగ్‌’ కార్యక్రమం నిర్వహించారు. శేషాద్రిని రెడ్డి భుజాలపై ఎస్పీ అశోక్ కుమార్ స్టార్ చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీపై వెళ్తున్న శేషాద్రిరెడ్డిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.

Similar News

News February 10, 2026

విశాఖ సీపీని కలిసిన సింహాచలం ఈవో

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని, జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్‌ను సింహాచలం ఈవో వెంకటరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రానున్న చందనోత్సవ వేడుకలపై వీరు చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవోకు జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ సూచించారు.

News February 10, 2026

సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నారా?

image

రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ బిల్స్‌లో సర్వీస్ ఛార్జీ వసూలు చేయడం కన్జూమర్ లాను బ్రేక్ చేయడమేనని కేంద్ర వినియోగదారుల సంస్థ(CCPA) పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు తాజాగా దేశంలోని 27 రెస్టారెంట్లకు రూ.50వేల వరకు జరిమానా విధించినట్లు తెలిపింది. సర్వీస్ ఛార్జీ పూర్తిగా వినియోగదారుని ఇష్టమని, బలవంతంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. బాధితులు <>NCHలో<<>> ఫిర్యాదు చేయవచ్చు.

News February 10, 2026

పుంగనూరు: రౌడీషీటర్ దారుణ హత్య

image

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డీజే భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హత్యకు గురై ఉండగా స్థానికులు గుర్తించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మృతుడిపై పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఘటనపై నంగిలి పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.