News March 20, 2025
జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 22.564 టీఎంసీలకు చేరింది. యాసంగి పంటల సాగునీరు, తాగునీటి అవసరాలకు కాలువల ద్వారా విడుదల జరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,447 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కాకతీయ కాలువ ద్వారా 5,000, లక్ష్మి కెనాల్ ద్వారా 250, అలీసాగర్ లిఫ్ట్‌కు 540 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తెలిపారు.
Similar News
News March 20, 2025
ఆర్సీబీ వదిలేశాక భావోద్వేగానికి లోనయ్యాను: సిరాజ్

ఆర్సీబీ నుంచి వేరయ్యాక తాను భావోద్వేగానికి లోనయ్యానని పేసర్ సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్ ఈరోజు ఇలా ఉండటం వెనుక విరాట్ కీలక పాత్ర పోషించారు. 2018-19 మధ్యకాలంలో నేను కష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాలా మద్దతునిచ్చారు. ఆ తర్వాతే నా ప్రదర్శన మెరుగై నా కెరీర్ గ్రాఫ్ మారింది. వచ్చే నెల 2న RCBతో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. వేలంలో ఆయన్ను గుజరాత్ దక్కించుకుంది.
News March 20, 2025
భారత్‌కు సొంతంగా బ్రౌజర్!

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్‌కు ఇదో సదవకాశం. బ్రౌజర్‌కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.
News March 20, 2025
జగిత్యాల: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 67 పరీక్ష కేంద్రాల్లో 11,855 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన అన్నారు. 826 ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.