News March 29, 2025
జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా శుక్రవారం నాటికి 1066.20 అడుగులకు తగ్గింది. అదేవిధంగా నీటి నిల్వ కూడా 17.557 టీఎంసీలకు చేరింది. ఎండ వేడికి రోజూ 434 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అయితే యాసంగి పంటలకు కాల్వలు, ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.
Similar News
News March 31, 2025
చైనాలో 1000 టన్నుల బంగారం నిక్షేపాలు

చైనా జాక్‌పాట్ కొట్టింది. దేశానికి ఈశాన్యంలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో 1000 టన్నుల బంగారు నిక్షేపాలు బయటపడ్డాయని భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వీటిని మైనింగ్ చేయడం అసాధ్యమన్న అభిప్రాయాలు అంతర్జాతీయ నిపుణుల నుంచి వ్యక్తమవుతుండగా చైనా పరిశోధకులు కొట్టి పారేస్తున్నారు. సుమారు 3 కి.మీ మేర నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలో స్వర్ణ ఉత్పత్తిలో చైనాయే అగ్రస్థానంలో ఉంది.
News March 31, 2025
ఎంపురాన్@రూ.200 కోట్లు

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2:ఎంపురాన్’ మూవీ చరిత్ర సృష్టించింది. 5 రోజులు పూర్తికాక ముందే రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతోంది. ఈ నెల 27న మూవీ విడుదలైన విషయం తెలిసిందే.
News March 31, 2025
HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.