News January 1, 2026
జగిత్యాల: ఎస్సారెస్పీ కాలువలో బాలిక గల్లంతు

మెట్‌పల్లి పట్టణ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో విషాదం చోటుచేసుకుంది. తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లిన బుట్టి సంజన(11) ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి గల్లంతయ్యింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాప కోసం కాలువలో విస్తృతంగా గాలిస్తున్నారు.
Similar News
News January 9, 2026
బాపట్ల కలెక్టర్ హెచ్చరికల జారీ..!

జిల్లాలోని చెరువులు, కాలువలు, కుంటలు వంటి జలవనరులను ఆక్రమణల నుంచి కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ వాచ్‌డాగ్ కమిటీ-వాటర్ బాడీస్ సమావేశం జాయింట్ కలెక్టర్ భావన అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జలవనరులపై అక్రమ కబ్జాలు, మట్టి నింపివేతలు, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News January 9, 2026
విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ కార్యాలయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలపై రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
News January 9, 2026
దేవదాయశాఖ భూముల పరిరక్షణ అధికారులదే బాధ్యత: కలెక్టర్

దేవదాయశాఖ భూముల పరిరక్షణ బాధ్యత అధికారులదేనని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదాయ భూముల దస్త్రాలను పకడ్బందీగా ఉంచాలన్నారు. సర్వే నంబర్లు లేని దేవాలయాలు, సత్రాలకు ప్రత్యేక ఖాతాలు దాఖలు చేయాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూముల సమస్యలను రెవెన్యూ, దేవదాయ శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.


