News August 16, 2025
జగిత్యాల: ‘ఐకమత్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం’

జర్నలిస్టులు ఐకమత్యంగా ఉంటేనే వారి సమస్యలు పరిష్కారమవుతాయని TUWJ (IJU) JGTL జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం JGTLలో ప్రెస్ క్లబ్, ధరూర్ క్యాంపులో ఉన్న జిల్లా కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 16, 2025
KMR: జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గతేడాది 170 రోడ్డు ప్రమాదాల్లో 179 మంది మరణించగా, 315 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇదే కాలంలో 1129 ప్రమాదాలలో 135 మంది మరణించగా, 272 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కామారెడ్డి జిల్లా పోలీసులు సాధించిన ఈ పురోగతిని రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ అభినందించారు.
News August 16, 2025
కాశీబుగ్గలో 20 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన నాయక్, రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్ వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకి పంపించామని అన్నారు.
News August 16, 2025
HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్‌లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.