News January 17, 2026
జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం’

జగిత్యాల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయికల్, జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత పాల్గొన్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరడం ఖాయమని కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
Similar News
News February 14, 2026
శివాలయాల వద్ద భద్రత ఏర్పాట్లు: ASF ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలోని ప్రసిద్ధ శివాలయం, రెబ్బెన(M)నంబాల శివాలయం, ఇస్గాంలోని శివ మల్లన్న ఆలయాల్లో భారీ భక్తుల తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్, జనసందోహం నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
News February 14, 2026
పారిశ్రామికవేత్త దిశగా అడుగులేద్దాం: కలెక్టర్

ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు జారీచేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శనివారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోందని పేర్కొన్నారు.
News February 14, 2026
పార్టీల మధ్య ఆగని ‘వాలంటైన్స్ డే’ వార్

TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆగడం లేదు. మధ్యాహ్నం ఒకరిపై ఒకరు చేసుకున్న ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ‘BRS loves modi more than TG’ అని కాంగ్రెస్ ట్వీట్ చేయగా ‘ఆయనకి ఇద్దరు’ పోస్టర్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు BJP కౌంటర్ ఇచ్చింది. ఇక ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పోస్టర్‌తో బీజేపీ, కాంగ్రెస్, MIMపై BRS సెటైర్లు వేసింది.


