News January 18, 2026

జగిత్యాల: ఐదు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

image

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను శనివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఖరారు చేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించి, మహిళా రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

Similar News

News February 18, 2026

ఆస్ట్రేలియా ఔట్.. వరుసగా మూడో సారి!

image

వరుస ఓటములతో టీ20 WC సూపర్-8 రేసు నుంచి ఆస్ట్రేలియా <<19167885>>నిష్క్రమించడం<<>> తెలిసిందే. సెమీఫైనల్ దాకా చేరకుండా ఆ జట్టు వైదొలగడం వరుసగా మూడో సారి. 2021లో ఆసీస్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ 2022లో సూపర్-12, 2024లో సూపర్-8 దశలోనే ఇంటిదారి పట్టింది. 2024లో అఫ్గాన్ దెబ్బకొడితే, ఈసారి జింబాబ్వే షాకిచ్చింది. దీంతో లీగ్ దశలో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.

News February 18, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. నూతన రిజిస్ట్రార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

News February 18, 2026

జనగామ: కలెక్టరేట్‌లో నేడు శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం

image

జనగామ కలెక్టరేట్‌లోని మహిళా ఉద్యోగుల చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించనున్నారు. ఐడీఓసీ భవనంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం పక్కన ఈ కేంద్రాన్ని సర్వసౌకర్యాలతో సిద్ధం చేశారు. కలెక్టర్ చొరవతో ఏర్పాటైన ఈ కేంద్రం వల్ల విధుల్లో ఉండే మహిళా ఉద్యోగులకు తమ పిల్లల సంరక్షణ విషయంలో పెద్ద ఊరట లభించనుంది.