News December 21, 2025
జగిత్యాల: ఒకే నంబరుతో రెండు వాహనాలు.. సీజ్

జగిత్యాల రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒకే నెంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న 2 టాటా ఏస్ వాహనాలను జగిత్యాల పట్టణంలో సీజ్ చేశారు. ఈ వాహనాలను స్కూల్ పిల్లల రవాణాకు అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన వాహనాలను జగిత్యాల బస్ డిపోకు తరలించారు. ఈ తనిఖీల్లో MVIలు అభిలాష్, రియాజ్, కానిస్టేబుల్ రవి, హోంగార్డులు అశోక్, సునీల్ ఉన్నారు.
Similar News
News December 26, 2025
BHELలో అప్రెంటిస్ పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(<
News December 26, 2025
ఫెలోపియన్ ట్యూబ్స్ పని చేయకపోవడానికి కారణాలు

ఫెలోపియన్ ట్యూబ్స్‌లో సమస్యలు చాలా తక్కువమందిలో కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఇన్‌ఫెక్షన్లు కలగడం, ట్యూబ్ దెబ్బతినడం లేదా తొలగిపోవడం వల్ల, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల శాశ్వతంగా ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం లేదా ఆ ట్యూబ్‌ని తీసివేయడం, పుట్టుకతోనే ఫెలోపియన్ ట్యూబ్ అసాధారణ రీతిలో అభివృద్ధి చెందడం, ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ పనిచేయకపోవచ్చంటున్నారు.
News December 26, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బదిలీ..!

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం.హరిత బదిలీ అయ్యారు. చాలారోజులుగా సెలవులో ఉన్న ఆమెను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దివారాలుగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌ను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్(పూర్తి అదనపు బాధ్యతలు)గా కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


