News August 13, 2025

జగిత్యాల: ఒకే వేదికపై ఎమ్మెల్యే, మాజీమంత్రి

image

జగిత్యాల MLA సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. జీవన్ రెడ్డి సోదరుడు, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కూతురు వివాహ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి MLA సంజయ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. దీంతో అవాక్కవడం అందరివంతైంది.

Similar News

News August 14, 2025

జేవీఆర్, కిష్టారం ఓసీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

image

జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఓసీలలో బొగ్గు ఉత్పత్తి, ఓబీలు నిలిచినట్లు పీవోలు ప్రహ్లాద్, నరసింహారావు తెలిపారు. Jvr OCPలో 68 mm వర్షపాతం నమోదవగా.. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.20 లక్షల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి. అదేవిధంగా Kistaramఓసీలో 6 వేల టన్నుల‌ బొగ్గోత్పత్తి, 30 వేల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి.

News August 14, 2025

కరీంనగర్‌: నేటితో PACSల కాల పరిమితి ఖతం!

image

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు నేటితో ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్‌లోని 131 PACSలకు 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సహకార సొసైటీల పాలకవర్గాల సభ్యులను ఎన్నుకున్నారు. వారి 5 ఏళ్ల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముగియగా.. ప్రభుత్వం 6 నెలల పదవీకాలం పొడిగించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం PACS 123 ఉండగా కరీంనగర్లో 30, జగిత్యాల 51, సిరిసిల్ల 22, పెద్దపల్లిలో 20 ఉన్నాయి.

News August 14, 2025

పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్‌ఆర్ ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆర్&ఆర్, భూ సేకరణపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఏలూరు జిల్లాలో 5 వేలు ఎకరాలు భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1400 ఎకరాలను గుర్తించామన్నారు. భూ సేకరణ పనులు ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.