News January 30, 2025

జగిత్యాల కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు

image

జగిత్యాల కలెక్టరేట్లో మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం మౌనం పాటించి నివాళులర్పించారు. భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ప్రసాదించిన మహా నాయకుడు, సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన జాతిపిత మహాత్మా గాంధీ అని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

SRCL: పెద్దింటి అశోక్‌ కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

image

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గేయ రచయిత అయిన పెద్దింటి అశోక్‌ కుమార్‌కు ‘అమృత లత జీవన సాఫల్య పురస్కారం-2025’ లభించింది. నిజామాబాద్‌లోని అపురూప అవార్డు బృందం వారు ఆదివారం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల నుంచి ఐదు ఎంఫిల్, నాలుగు పీహెచ్‌డీ పట్టాలు రావడం విశేషం.

News November 3, 2025

సీఏ ఫలితాలు విడుదల

image

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://icai.nic.in/caresult/<<>>

News November 3, 2025

అచ్చంపేట: రేషన్ గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు బియ్యం

image

2024 ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. నిల్వ ఉన్న దొడ్డు బియ్యం గురించి సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు రేషన్ బియ్యం ఏడాది కాలంగా తుట్టెలు కట్టి, పురుగులు పట్టీ ముక్కి పోతున్నాయి. అదే గోదాంలలో నిల్వ ఉన్న సన్న బియ్యనికి కూడ పురుగులు పడుతున్నాయి.