News March 2, 2025
జగిత్యాల కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం మాజీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ తదితర అధికారులు శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్‌లత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 3, 2025
దేవర-2లో రణ్‌వీర్ సింగ్?

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సూపర్ హిట్ కావడంతో పార్ట్-2పై డైరెక్టర్ కొరటాల శివ కసరత్తు చేస్తున్నారు. ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. త్వరలోనే ఆయనకు కథను వినిపిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News March 3, 2025
షాబాద్: రెండు బైక్‌లు ఢీకొని యువకుడి మృతి

రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందారు. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాలు.. కొత్తూరు మండలం మల్లాపూర్ తండాకు చెందిన మెగావత్ నైందు(27), షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన కావలి రంజిత్ కుమార్ బైక్‌లు మద్దూరు సమీపంలో ఢీకొన్నాయి. దీంతో నైందు మృతిచెందగా.. రంజిత్, ఆయన మూడేళ్ల కొడుకు తీవ్రంగా గాయపడగా రంజిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి భార్య రాధిక ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
News March 3, 2025
పాత చింతకాయ పచ్చడిలా వాగుతున్న CM: హరీశ్ రావు

CM రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడిలా వాగుతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీల గురించి మాట్లాడడం చేతకాదని విమర్శించారు. పాలమూరుకు రేవంత్ రెడ్డి చేసిందేమీలేదన్నారు.