News February 19, 2025
జగిత్యాల కలెక్టర్‌తో చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై మంగళవారం జగిత్యాల కలెక్టర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా కొనసాగించాలని, రైతు భరోసాపై గ్రీవెన్స్ సెల్‌ను జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 13, 2025
ASF: ఈ-పాస్ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోండి

జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతున్న బీసీ (BC), ఈబీసీ (EBC) విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమాదేవి తెలిపారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News November 13, 2025
ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ బుధవారం అధికారులను ఆదేశించారు. రహదారులు, స్వదేశీ దర్శన్, నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్, ఆక్వాపార్క్ పనులపై కలెక్టరేట్ న్యూ వీసీ హాల్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూర్యలంక బీచ్, ఆక్వాపార్క్ అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
News November 13, 2025
మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు

మహిళను వేధించిన కేసులో కోర్టు ఒకరికి జైలు శిక్ష విధించినట్లు కొల్లూరు SI అమర వర్ధన్ తెలిపారు. SI వివరాల మేరకు తాడిగిరిపాడుకు చెందిన టి. క్రీస్తురాజు అదే గ్రామానికి చెందిన ఓ మహిళని 2022లో వేధించేవాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. అతనిపై నేరం నిరూపణ అవ్వటంతో తెనాలి ప్రధాన సివిల్ జడ్జ్ పవన్ కుమార్ ఒక నెల జైలు శిక్ష, రూ.1000లు జరిమాన విధించారు.


