News February 14, 2026

జగిత్యాల: కళ్యాణ మహోత్సవంలో కలెక్టర్ దంపతులు

image

సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి కలెక్టర్ బి.సత్య ప్రసాద్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Similar News

News February 21, 2026

కశింకోట: పాముకాటుతో బాలుడి మృతి

image

ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని పాము రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన శనివారం జరిగింది. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం మోసయ్యపేట గ్రామానికి కిరణ్ (3) ఇంటి బయట ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన బాలుడి అమ్మమ్మ గోవిందమ్మ హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన డాక్టర్ పాముకాటుతో మృతి చెందినట్లుగా నిర్ధారించారు.

News February 21, 2026

యాదగిరిగుట్ట: 5వ రోజు బ్రహ్మోత్సవాలు..

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు 2026 వైభవంగా కొనసాగుతున్నాయి. అయిదో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు స్వామివారు మనోహరమైన శ్రీకృష్ణాలంకారంలో (మురళీకృష్ణుడిగా) భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు విశేషమైన పొన్న వాహనంపై మాడ వీధుల్లో ఊరేగింపు జరగనుంది. ఈ అపురూప వేడుకలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావాలని దేవస్థానం అధికారులు కోరారు.

News February 21, 2026

తూ.గో: నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం

image

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.