News November 10, 2025
జగిత్యాల కవయిత్రికి ‘కీర్తి’ చక్ర పురస్కారం

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ మద్దెల సరోజన “జాతీయ కీర్తి చక్ర-2025” పురస్కారం అందుకున్నారు. కరీంనగర్‌లో ఆర్యాణి సకల కళా వేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కవయిత్రి సరోజనను జగిత్యాలకు చెందిన కవులు, కళాకారులు అభినందించారు.
Similar News
News November 10, 2025
ఢిల్లీ కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన

ఢిల్లీ వాయు కాలుష్యంపై సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ మీదుగా రాంచీకి వెళ్లా. ఎప్పటిలానే అక్కడి ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. గోవాలోని చిన్న గ్రామంలో నేను నివసిస్తున్నందుకు సంతోషిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇటీవల ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ పడిపోయిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాలు ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉన్నాయి.
News November 10, 2025
కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను(చలి తీవ్రతను) అధికారులు వెల్లడించారు. కనిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతలు.. భిక్కనూర్,సర్వాపూర్, వెల్పుగొండ లలో 14.7°C, బీర్కూరు,పుల్కల్, హసన్ పల్లి,బొమ్మన్ దేవిపల్లి లలో 14.8°C, నాగిరెడ్డిపేట,ఇసాయిపేట,రామలక్ష్మణపల్లి,మాచాపూర్ లలో 14.9°C, మేనూర్,దోమకొండ, మాక్దూంపూర్, జుక్కల్ లలో 15°C లుగా రికార్డ్ అయ్యాయి.రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది.
News November 10, 2025
జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్‌లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


