News December 28, 2025
జగిత్యాల: ‘కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారు’

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ (M) లక్ష్మీదేవిపల్లె మాజీ సర్పంచ్ లక్ష్మి తమ అనుచరులు 50 మంది, ధర్మానాయక్ తండా నుంచి చందు నాయక్‌తో పాటు 10 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Similar News
News December 30, 2025
న్యూ ఇయర్ ప్రశాంతంగా జరుపుకోవాలి: రామగుండం CP

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 31న రాత్రి 10 గంటల నుంచి నిర్వహించే స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
కామారెడ్డి: సౌత్ ఇండియా బెస్ట్ పీడీగా సంధ్య

మాచారెడ్డి మండలం సోమవారంపేట స్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంధ్య ఘనత సాధించారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని దక్షిణ భారతదేశంలో ఆమె ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్‌గా ఎంపికైనట్లు హెచ్ఎం భాస్కర్ తెలిపారు. జనవరి 3న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఆమెకు అవార్డును అందజేయనున్నారు. సంధ్యను కుటుంబ సభ్యులతోపాటు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
News December 30, 2025
JGTL: పాపం.. ఉపాధ్యాయులకు ’పరీక్షా’కాలం

2011కు ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ గండంగా మారింది. అయితే జనవరి 3- 9వరకు నిర్వహించే టెట్ పరీక్షకు జిల్లాకు చెందిన టీచర్లకు సుమారు 300- 400 కి.మీ.ల దూరంలోగల ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సెంటర్ వేయడంతో దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే అంత దూరం వెళ్లలేక పరీక్షను రాయడానికి సుముఖత చూపట్లేదు.


