News February 5, 2025
జగిత్యాల: కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 2018లో సిరిసిల్ల జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. అనంతరం 2020లో జగిత్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. అనంతరం కథలాపూర్, వెల్గటూర్, కోరుట్లలో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్ఐగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Similar News
News July 6, 2025
ఖమ్మం: ‘పల్లె ప్రకృతి వనం’.. పట్టించుకోక అధ్వానం

తల్లాడ(M) కేశవాపురంలో పల్లె ప్రకృతి వనం అడవిని తలపిస్తుండటంతో చూపరులను ఆకర్షిస్తుంది. మొక్కలకు గతంలో నిత్యం నీటిని అందించడం వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో ఏపుగా పెరిగి అడవిగా అవతరించి, చూడటానికి మినీ పార్కులా కనిపిస్తోంది. కానీ నేడు తాళాలు వేసి అధికారులు పట్టించుకోపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించి, వనాన్ని సుందరీకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News July 6, 2025
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ADB SP

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలకు గురైన
వారు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. గతవారం జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్

రెండో టెస్టులో భారత్ సంధించిన భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమని, పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు. తామేమీ పిచ్చోళ్లం కాదని గెలుపు కుదరకపోతే డ్రా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ‘ఒక్క రోజులో 550కుపైగా పరుగులు చేయడం అసాధ్యం. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం ఆపరు’ అని ఆయన స్పష్టం చేశారు.