News September 10, 2025

జగిత్యాల: కాళోజీ రచనలు సమానత్వాన్ని ప్రతిబింబించాయి

image

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాకవి కాళోజీ సేవలు, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి, రచనలు, తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింబించాయని కలెక్టర్ అన్నారు.

Similar News

News September 10, 2025

SKLM: అప్పారావు నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని గుడి వీధికి చెందిన ఆంధవరపు అప్పారావు (93) బుధవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి.సుజాత, ఉమశంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News September 10, 2025

NLG: ఏటేటా తగ్గుతున్న కూరగాయల సాగు

image

జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ శాతం MNGD, DVK, సాగర్, NKL నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేపడుతున్నారు. సాగు గిట్టుబాటుకాకపోవడం, ప్రభుత్వం రాయితీలు కల్పించకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, దళారులు రంగప్రవేశం చేయడం వంటి కారణాలతో రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్ల క్రితం 42 వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ప్రస్తుతం 80 శాతం సాగు పడిపోయింది.

News September 10, 2025

పల్నాడు: ఫ్రెండ్స్ మధ్య గొడవ.. గన్‌తో కాల్చేశాడు..!

image

చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ (22)ను నోయిడాలో అతని స్నేహితుడు దేవాన్ష్ పిస్టల్‌తో కాల్చి చంపాడు. మంగళవారం హాస్టల్ గదిలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, దేవాన్ష్ తన లైసెన్సుడు పిస్టల్‌తో దీపక్ నుదుటిపై కాల్చాడు. ఆ తర్వాత దేవాన్ష్ కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.