News March 13, 2025

జగిత్యాల: కొడుకుపై ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు

image

తమ కుమారులు తమను పోషించడం లేదని మల్లెల మండలం పోతారం గ్రామానికి చెందిన చిన్న నిమ్మ నర్సయ్య- భూమక్క అనే వృద్ధ దంపతులు గురువారం జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ను ఆశ్రయించారు. తాము కట్టించిన ఇండ్లలో తమకు చోటు ఇవ్వడంలేదని, తమకు తిండి సరిగా పెట్టడం లేదని, బిపి, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నామని రోదిస్తూ చెప్పారు. ఈ విషయమై అడిగితే కొడుకు, కోడలు కొడుతున్నారని ఫిర్యాదు చేశారు. వారి వెంట హరి, అశోక్ కుమార్ ఉన్నారు.

Similar News

News March 14, 2025

ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

image

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.

News March 14, 2025

BREAKING: ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

హోలీ పండుగ వేళ ఆదిలాబాద్‌లో విషాదం జరిగింది. పట్టణంలోని ఎరోడ్రం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతుండగా ఇద్దరు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రిషి కుమార్ అనే యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు ప్రేమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ సునీల్ కుమార్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 14, 2025

‘పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలి’

image

పశు బీమాను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డున్న పాడి రైతులంతా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52,98,000 బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు.

error: Content is protected !!