News December 22, 2025
జగిత్యాల: కొత్త సర్పంచులకు సవాళ్లెన్నో..!

నేడు కొలువుదీరనున్న గ్రామపంచాయతీ పాలక వర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతేడాది FEBలోనే వీరి పదవి గడువు ముగియడంతో BC రిజర్వేషన్లు, ఇతర కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈనెల 11 నుంచి 17వరకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇక అరకొర నిధులతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు కొత్త సర్పంచులకు సవాల్‌గా మారనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 385 గ్రామపంచాయతీలు, 3536 వార్డు స్థానాల్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News December 22, 2025
Credit Card Scam: లిమిట్ పెంచుతామంటూ..

‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న చందంగా మారింది సైబర్ మోసగాళ్ల పని. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఈ మధ్య కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కాల్స్, SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డు సంస్థలకు చెందిన వాళ్లమని నమ్మబలుకుతారు. OTP, CVV వంటి కీలక సమాచారాన్ని లాగుతారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు పేరిట లింక్ పంపి బురిడీ కొట్టిస్తారు.
News December 22, 2025
జగిత్యాల: ప్రజావాణిలో 34 ఫిర్యాదుల స్వీకరణ

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ చేసి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నేడు ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 34 ఫిర్యాదులు, వినతులు అందాయని తెలిపారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన సమస్యలను శాఖలవారీగా పరిశీలించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
News December 22, 2025
FLASH: HYD: లారీ ఢీకొని SI దుర్మరణం

మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


