News September 22, 2025

జగిత్యాల: క్రీడలతో పోటీ భావన పెరుగుతుంది: SP

image

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ & బ్యాట్మెంటన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీస్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మన శారీరక ఆరోగ్యానికి బలాన్ని అందించడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడలతో మనలో పోటీ భావన పెరుగుతుందని, అలాగే సహచరులను ప్రోత్సహించే స్ఫూర్తి కూడా వస్తుందని పేర్కొన్నారు.

Similar News

News September 22, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీల స్వీకరణ

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News September 22, 2025

450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: కన్నబాబు

image

తుళ్లూరు స్కిల్ హబ్‌లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులు అమరావతి, VJA, HYDలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

News September 22, 2025

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఈ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.