News February 7, 2025
జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738920348643_25475752-normal-WIFI.webp)
జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
Similar News
News February 7, 2025
ఉట్నూర్: 9 నుంచి జాతర క్రీడాపోటీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738927433746_51941271-normal-WIFI.webp)
ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూరులో బుడుందేవ్ జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు మేనేజిమెంట్ సభ్యుడు పెందూర్ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేస్తామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరుకావాలని వారు కోరారు.
News February 7, 2025
ప్రొద్దుటూరులో యువకుడి హత్య.?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738929108208_52218543-normal-WIFI.webp)
ప్రొద్దుటూరు రామేశ్వరంలోని ఇటుకల బట్టీలలో యువకుడి ఆత్మహత్య అంటూ మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే తమ కుమారుణ్ని ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటే పోలీసులు వెళ్లకుండానే ఎలా మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
News February 7, 2025
లింగంపేట్: దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738927546486_51904184-normal-WIFI.webp)
లింగంపేట్ మండలం కోమట్ పల్లి గ్రామంలో శుక్రవారం కొందరు అపరిచిత వ్యక్తులను స్థానికులు పోలీస్‌లకు అప్పగించారు. గ్రామంలో జాతకాలు చెప్తామని, మీ ఇంట్లో అశుభం జరుగుతుందని గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసినట్లు స్థానికులు తెలిపారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.