News April 2, 2026
జగిత్యాల: క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

కొండగట్టులో జరుగుతున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి ఆలయ పరిసరాలను, దీక్షపరులు మాల విరమణ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షిస్తూ పలు సూచనలు చేశారు.
Similar News
News April 5, 2026
నల్గొండ: కేరళంలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కేరళం రాష్ట్రం కొచ్చిలోని గిరిజన నైపుణ్య శిక్షణా సంస్థలో మే నెలలో ప్రారంభమయ్యే 6నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో తెలంగాణ గిరిజన యువతకు 25సీట్లు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10లోపు https://dsapponline.com/sds/form/register.php వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు నల్గొండలోని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
News April 5, 2026
తిరుమల విద్యాసంస్థల సదస్సుకు అనూహ్య స్పందన

రాజమండ్రి కాతేరులో శనివారం నిర్వహించిన విద్యా అవగాహన సదస్సుకు సుమారు 13 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. పదో తరగతి విద్యార్థులకు JEE, NEET శిక్షణపై ఛైర్మన్ నున్న తిరుమలరావు అవగాహన కల్పించారు. జాతీయ సగటు కంటే తమ సంస్థలో అధిక శాతం మంది సీట్లు సాధిస్తున్నారని ఆయన వివరించారు. డైరెక్టర్ సరోజిని దేవి , పలువురు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News April 5, 2026
సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల ఉచిత బీమా

సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా కల్పించేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ నెల(APR) 1వ తేదీ నుంచే ఈ విధానం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. సంస్థ చరిత్రలో సహజ మరణానికి ఇంత భారీ బీమా వర్తించడం ఇదే తొలిసారి కావడంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


