News September 10, 2025
జగిత్యాల: గణపతి చందా ఇవ్వలేదని 4 కుటుంబాల బహిష్కరణ

జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడితే రూ.25 వేల జరిమానా అంటూ ఊర్లో దండోరా వేయించారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే రూ.1,116 ఇచ్చాకే కొట్టాలన్నారు. అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తోంది.
Similar News
News September 10, 2025
నిర్మల్: మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా లావణ్య

నిర్మల్ జిల్లాకు చెందిన బి.లావణ్యను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఛైర్మన్ శ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 10, 2025
ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం!

C.P. రాధాకృష్ణన్ ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్లుండి ఆయనతో ప్రమాణం చేయిస్తారని అధికార వర్గాల సమాచారం. నిన్నటి ఎన్నికలో రాధాకృష్ణన్ 152 ఓట్లతో ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే.
News September 10, 2025
SC కార్పోరేషన్ నిధుల దుర్వినియోగం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

ED సంతకం ఫోర్జరీ చేసి ఏలూరు జిల్లా SC కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసిన జూనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం సస్పెండ్ చేశారు. తాజాగా రూ.6 లక్షలు విత్‌డ్రా చేసిన అతను 2019 నుంచి రూ.70 లక్షల వరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల నిధుల దుర్వినియోగంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారని కలెక్టర్ స్పష్టం చేశారు.