News August 27, 2025
జగిత్యాల: గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, పోలీసు శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి వినాయక మండపం నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసేలా అవగాహన కల్పించినట్లు వివరించారు.
మండపాల వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో మండపాల వద్ద ఉండాలన్నారు.
Similar News
News August 27, 2025
SRSP UPDATE: 3.50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 39 స్పిల్వే వరద గేట్ల ద్వారా 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జగదీశ్ హెచ్చరించారు.
News August 27, 2025
జనగామ జిల్లాలో బుధవారం టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు
> లింగాల గణపురం: తాడిచెట్టు పైనుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
> జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు
> నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో కొడకండ్ల కేజీవీబీ కీర్తి
> జఫర్గడ్: మట్టి వినాయకుడిని తయారుచేసిన బీవీ విద్యార్థులు
> గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
News August 27, 2025
గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.