News September 11, 2025
జగిత్యాల: ‘గర్భిణులు పరీక్షలు చేయించుకోవాలి’

జగిత్యాల జిల్లా ఉపవైద్యాధికారి ఎన్.శ్రీనివాస్ ఈరోజు మోతెవాడ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సికిల్ సెల్ వ్యాధితో హిమోగ్లోబిన్, ఆక్సిజన్ తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాధి తొలి దశలోనే గుర్తించేందుకు గర్భిణులు 12 వారాల్లోపు పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
Similar News
News September 11, 2025
పెద్దపల్లి: ‘సెప్టెంబర్ 16న జాబ్‌మేళా’

నిరుద్యోగ యువకుల కోసం సెప్టెంబర్ 16న పెద్దపల్లి కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. గూగుల్ పే, హైరింగ్ రిక్వెస్ట్ కంపెనీలో 20 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయన్నారు. బైక్, పాన్ కార్డు, ఆండ్రాయిడ్ మొబైల్ తప్పనిసరి. ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో 18-35 ఏళ్ల వయసు గల వారు అర్హులు. ఆసక్తి గల వారు సర్టిఫికేట్స్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.
News September 11, 2025
ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ ఈవినింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో 23వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News September 11, 2025
శ్రీలంక జైలు నుంచి నలుగురు మత్స్యకారుల విడుదల

శ్రీలంక కోస్ట్‌గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్న నలుగురు మత్స్యకారులు గురువారం విడుదలయ్యారు. ఆగస్టు 4న సాంకేతిక సమస్యతో శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్లిన కాకినాడకు చెందిన ఈ మత్స్యకారులను జాఫ్నా జైల్లో నిర్బంధించారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, భారత దౌత్య అధికారుల కృషితో వారు విముక్తి పొందారు.