News March 19, 2024
జగిత్యాల: గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి

గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటనా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పౌల్ట్రీ నిర్మాణ పనులు జరుగుతుండగా కాంక్రీట్ మిక్సర్ వాహనం గోడను ఢీకొంది. దీంతో అవతలి వైపు ఆడుకుంటున్న చిన్నారిపై ఇటుకలు పడ్డాయి. ఈ క్రమంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. బాలుడి తల్లిదండ్రులు కూలీ పనుల కోసం మేడిపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 9, 2025
జగిత్యాలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే

జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుంచి 1116 వరకు పొలాస రాజధానిగా జగ్గ దేవుడు పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు. పొలాస దక్షిణాన 6 కి.మీ. దూరంలో జయదేవుడు అతని పేరిట జగ్గ దేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాల స్థిరపడిందని చరిత్రకారుల కథనం. 2016లో జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.
News April 8, 2025
KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్

జిల్లా కేంద్రo కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదామ్‌ను మంగళవారం అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నామన్నారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరాతీశారు.
News April 8, 2025
KNR: శిక్షణను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలి: కలెక్టర్

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల సహకారంతో ప్రభుత్వ విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అల్ఫోర్స్ విద్యాసంస్థ సహకారంతో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒలంపియాడ్‌లో శిక్షణ ఇప్పించారు. ఈ పరీక్ష రాసి మెరిట్ సాధించిన విద్యార్థులకు ఈరోజు మెడల్స్, సర్టిఫికెట్స్ కలెక్టర్ అందజేశారు.