News October 13, 2025
జగిత్యాల: గ్రీవెన్స్ డే.. స్వయంగా సమస్యలు విన్న SP

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారుల సమస్యలను ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను ఫిర్యాదుల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమస్యలను త్వరగా, పెండింగ్ లేకుండా పరిష్కరించడం, ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి పర్యవేక్షించడం చేయాలని సూచించారు.
Similar News
News October 13, 2025
కొండగట్టు అంజన్న ఆదాయం ఎంతంటే..

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో 81 రోజులకు గాను 12 హుండీలను ఈవో శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ వేంకట అన్నమాచార్య ట్రస్ట్ వారు సోమవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,08,72,591 నగదు, 55 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన వెండి, బంగారంను సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రాజమొగిలి, అధికారులు పాల్గొన్నారు.
News October 13, 2025
ఇంటర్ యూనివర్సిటీ అసిలిరేటర్ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇంటర్ యూనివర్సిటీ అసిలిరేటర్ సెంటర్ 7 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వెబ్‌సైట్: https://www.iuac.res.in
News October 13, 2025
విశాఖలో పీజీఆర్ఎస్‌కు 271 వినతులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 271 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 82 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీ సంబంధించి 86 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 88 వినతులు ఉన్నాయి.