News March 7, 2025
జగిత్యాల: ఘోరం.. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో శుక్రవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. ఈ విషయమై దళిత సంఘాల నేతలు స్పందిస్తూ.. ఇది దేశాన్ని, యావత్ సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 4, 2025
క్రీడా ప్రాంగణాలు నిర్మించేందుకు కలెక్టర్ ఆదేశాలు

యువతలో క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించి, మండలాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క్రీడా అధికారులతో సోమవారం సమావేశం జరిగింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించాలని, యువత చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించేలా, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా చూడాలన్నారు.
News November 4, 2025
పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు

AP: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల <<17768393>>పని<<>> గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచింది. నిన్నటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం మొత్తంలో పని గంటలు 48 దాటితే ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట సవరణ చేశారు. మరోవైపు ఐదు మంది కంటే ఎక్కువ మహిళలుంటేనే వారిని రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించనున్నారు.
News November 4, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 65 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.


