News January 1, 2026
జగిత్యాల: చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ముందస్తు కార్యాచరణతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. శాంతిభద్రతల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో పర్యవేక్షణ చేపట్టామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 138 మందిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News February 18, 2026
హిందువులు ముగ్గురు పిల్లల్ని కనాలి: భాగవత్

దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘హిందువులను శక్తిమంతం చేయాలి. ఇప్పుడు ఎలాంటి ముప్పు లేదు. కానీ అప్రమత్తత అవసరం’ అని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చొరబాటుదారులను గుర్తించి పంపేయాలని, ఉపాధి కల్పించకూడదని అన్నారు.
News February 18, 2026
మాదకద్రవ్యాలతో రీల్స్ చేశారు.. అడ్డంగా బుక్ అయ్యారు!

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత దారి తప్పుతోంది. ఫలక్నుమాకు చెందిన శ్రీచరణ్, విజయ్ కృష్ణ అనే ఇద్దరు యువకులు శివరాత్రి పర్వదినం రోజున మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. గమనించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్, రీల్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోవద్దని యువతను హెచ్చరించారు.
News February 18, 2026
ఆస్ట్రేలియా ఔట్.. వరుసగా మూడో సారి!

వరుస ఓటములతో టీ20 WC సూపర్-8 రేసు నుంచి ఆస్ట్రేలియా <<19167885>>నిష్క్రమించడం<<>> తెలిసిందే. సెమీఫైనల్ దాకా చేరకుండా ఆ జట్టు వైదొలగడం వరుసగా మూడో సారి. 2021లో ఆసీస్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ 2022లో సూపర్-12, 2024లో సూపర్-8 దశలోనే ఇంటిదారి పట్టింది. 2024లో అఫ్గాన్ దెబ్బకొడితే, ఈసారి జింబాబ్వే షాకిచ్చింది. దీంతో లీగ్ దశలో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.


