News January 13, 2026

జగిత్యాల: చలో ఖమ్మం సీపీఐ శతాబ్ది సభకు పిలుపు

image

ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ వంద ఏళ్ల వేడుకల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాలలో మంగళవారం గోడపత్రికను ఆవిష్కరించారు. పట్టణ కార్యదర్శి మాడిశెట్టి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో పార్టీ ప్రస్థానాన్ని చాటేలా ఈ భారీ సభ సాగుతుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Similar News

News February 20, 2026

విజయ్‌పై బీజేపీ ఒత్తిళ్లు.. అయినా పొత్తు ఉండదు: TVK

image

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో BJPతో పొత్తు వార్తలను TVK పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ రాజ్ ఖండించారు. సినిమా వివాదాలు, తొక్కిసలాటపై CBI విచారణ పేరుతో విజయ్‌కు BJP నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. మతతత్వ పార్టీలతో కలిసేది లేదని, దేశంలో, రాష్ట్రంలోని అధికార పార్టీలు తన ప్రత్యర్థులని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం లేదన్న ఆరోపణలను తోసిపుచ్చారు.

News February 20, 2026

ఏయూ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

image

ఆంధ్రా యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడడం తప్పా.. భారతమాతకు జై అనడం తప్పా.. అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. వీసీకి ఫిర్యాదు చేయాలే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేయడం తగదన్నారు. వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు.

News February 20, 2026

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను బోర్డు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.