News March 26, 2024
జగిత్యాల: చికిత్స పొందుతూ మహిళ మృతి
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన <<12927777>>ఘర్షణ<<>> ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ప్రకాష్ అనే యువకుడు హోలీ ఆడుతుండగా పక్కింటి పైకి గుడ్డు విసిరాడు. దీంతో పక్కింటి రిషి, ఆయన తల్లి రమ అడగడంతో ప్రకాష్ కొడవలితో దాడిచేయగా రమకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 10, 2025
KNR: వసతి గృహాలను అధికారులు ప్రతినిత్యం పరిశీలించాలి: కలెక్టర్
ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిత్యం క్షేత్రస్థాయి సందర్శించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంఈవోలు కూడా హాస్టల్లో భోజనాల తయారీ తీరును పరిశీలించాలన్నారు. నూతన కామన్ మెనూ అమలు కోసం ఇంకా ఏమైనా వంట పాత్రలు వంటివి కావాలంటే అందిస్తామని తెలిపారు. హాస్టల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
News January 9, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ రేపటినుండి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. @ జగిత్యాల జిల్లాలో బిజెపి మండల నూతన అధ్యక్షుల నియామకం. @ పెగడపల్లి మండలంలో మెగా పశువైద్య శిబిరం. @ మల్లాపూర్ మండలంలో బావిలో పడి బాలుడి మృతి. @ కోరుట్ల మండలంలో సంపులో పడి యువకుడి మృతి. @ మానకొండూరు మండలంలో లారీ ఢీకొని యువకుడి మృతి. @ బాలుడికి ఆర్థిక సహాయం అందించిన సిరిసిల్ల కలెక్టర్.
News January 9, 2025
సిరిసిల్ల: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ
సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పండుగకి ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్‌స్టేషన్లో లేదా గ్రామ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.