News February 23, 2025
జగిత్యాల: చివరి దశకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. 25తో ప్రచారం ముగుస్తుండగా.. జిల్లాలో ఆయా పార్టీల నేతలు పోటాపోటీగా పట్టభద్రులను కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర అభ్యర్థులు సైతం ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ముందుగానే జీవన్ రెడ్డి గెలుపుపై వచ్చిన క్లారిటీ ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థికి రావడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీ సీరియస్‌గా తీసుకుంది.
Similar News
News February 23, 2025
పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 2,333 మంది

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అత్యధికంగా పార్వతీపురంలో 636 మంది, అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు పేర్కొన్నారు.
News February 23, 2025
హైదరాబాద్: సీఎం విజన్‌కు అనుగుణంగా చర్యలు: HMR MD

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాల్గో నగరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య రహిత హరిత నగరంగా, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు HMR డీపీఆర్ సిద్ధం చేస్తోందని వెల్లడించారు.
News February 23, 2025
ఆ జిల్లాల్లో 3 రోజులు వైన్ షాపులు బంద్

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ADB, కరీంనగర్, వరంగల్, NLG, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.