News September 17, 2025

జగిత్యాల : జడ్పీ కార్యాలయంలో జెండావిష్కరణ చేసిన కలెక్టర్

image

ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో గౌతమ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో MLA, ఉన్నతాధికారులు

image

ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై వివరించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News September 17, 2025

ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.

News September 17, 2025

20న తిరుపతిలో జాబ్ మేళా

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 20వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఫార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.