News January 1, 2026

‘జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి’

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని, అదే ఉత్సాహంతో 2026లోనూ పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆరోగ్యంపై శ్రద్ధ, యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 2, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,140 పెరిగి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 ఎగబాకి రూ.1,24,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 పెరిగి రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 2, 2026

కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

image

TG: కృష్ణా జలాల వ్యవహారంలో కాంగ్రెస్, BRS తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద జల్లుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కృష్ణా జలాల్లో 299 TMCలు చాలని KCR సంతకం చేసింది నిజమే. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం అడిగిన నీటి వివరాలివ్వకుండా రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అందుకే DPRను కేంద్రం వెనక్కు పంపింది. చేసిన అన్యాయంపై కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు.

News January 2, 2026

తాండూర్: ముగ్గు వేస్తున్న మహిళపై వీధి కుక్క దాడి

image

తాండూర్ మండలం రేచినిలోని పోచమ్మవాడకు చెందిన మామిడి రాజేశ్వరిపై శుక్రవారం వీధి కుక్క దాడి చేసింది. ఉదయం ఇంటి ముందు రాజేశ్వరి ముగ్గు వేస్తున్న సమయంలో కుక్క దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు. మహిళను చికిత్స నిమిత్తం108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.