News February 16, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS

@ మెట్పల్లి దొంగల చోరీ కేసులో పోలీసులకు రివార్డులు అందజేసిన ఎస్పీ @ మేడిపల్లిలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య @ జగిత్యాలలో ప్రముఖ చిత్రకారుడు గుండెపోటుతో మృతి @ చింతకుంటలో అగ్నిప్రమాదం.. గుడిసె దగ్ధం @ కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదం.. ధర్మపురి మహిళ మృతి @ తకలపల్లిలో నిప్పంటుకొని వృద్ధురాలు మృతి @ పెగడపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
Similar News
News September 19, 2025
సంగారెడ్డి: ‘31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా’

జిల్లాలో ఇప్పటివరకు 31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో 514 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద అందుబాటులో ఉందని చెప్పారు. 6912 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. చివరి వారం వరకు యూరియా సరఫరా అవుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News September 19, 2025
రాబోయే 4 రోజులు వర్షాలు

APలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
News September 19, 2025
నేడు YCP ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.