News February 20, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@ జిల్లావ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు @ఇసుక రీచ్‌లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ @మందకృష్ణ ను కలిసిన కథలాపూర్ నాయకులు@బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు.. రూ.13,69,163ఆదాయం @రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో సత్తాచాటిన జగిత్యాల విద్యార్థినులు @రాయికల్‌లో శివపార్వతుల కళ్యాణం @ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను పట్టుకున్న కలెక్టర్ @ఎండపల్లిలో శివాజీ విగ్రహవిష్కరణ
Similar News
News November 6, 2025
వేములవాడ: 16వ రోజు కొనసాగుతున్న కార్తీక దీపోత్సవం

వేములవాడ రాజన్న క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం 16వ రోజు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా నిత్యం ఆలయాల ఆవరణలో దీపోత్సవం నిర్వహించాలని దేవాదాయ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు భీమేశ్వరాలయం ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ఏఈవో అశోక్ కుమార్ దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News November 6, 2025
అన్ని కార్యాలయాల్లో రేపు సామూహిక వందేమాతరం

బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాలని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని కలెక్టర్ సూచించారు.
News November 6, 2025
‘ఉచితం, తక్కువ లాభం’ అంటే మోసమే: ఏసీపీ

సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం పేరుతో భయపెడుతూ, మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచితం లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది మోసమే అని గ్రహించాలని ప్రజలకు ఏసీపీ సూచించారు.


