News March 6, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు @ EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబురాలు @ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా వోదెల రామకృష్ణ @ మెట్పల్లిలో బీట్ చట్టం రద్దు చేయాలని నిరసన @ షుగర్ ఫ్యాక్టరీపై కోరుట్లలో బీజేపీ నేతల ధర్నా @ సారంగాపూర్ లో ఎండిన పొలం.. కన్నీరు పెట్టుకున్న రైతు @ కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన.

Similar News

News April 14, 2026

మామిడి రాకతో బాట‘సింగారం’

image

మామిడి పండ్లు బాటసింగారం బాట పట్టాయి. సోమవారం సుమారు వెయ్యి టన్నుల పండ్లు దిగుమతి అయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరంలోని మిగతా మార్కెట్లకు మరో 300 టన్నుల మామిడి వచ్చినట్లు అంచనా. ఈ ఏడాది పంట ఆలస్యమైనా ఏప్రిల్ 3వ వారం నుంచే నగర మార్కెట్లకు మామిడి రికార్డు స్థాయిలో దిగుమతి అవుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే సోమవారం మామిడి పండ్ల ధర కిలో రూ.70-120 పలికింది.

News April 14, 2026

తిరుపతి: రేపటి నుంచి పుస్తకాల పంపిణీ: ఆర్ఐవో

image

తిరుపతి జిల్లాలో ఇంటర్ క్లాసులు ప్రారంభమై 15 రోజులు గడిచినా రాధాకృష్ణన్ కిట్ పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఖాళీ చేతులతో క్లాసులకు వెళ్లిన విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన అధికారులు నూతన సిలబస్ పుస్తకాలను ఆర్ఐఓ కార్యాలయానికి చేరవేశారు. పంపిణీ ప్రక్రియ ప్రారంభమై, బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పుస్తకాలు అందనున్నాయని ఆర్ఐఓ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

News April 14, 2026

భయంకరమైన వ్యసనం.. సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేసుకుంటున్నారు

image

భోపాల్‌(MP)లో యువత భయంకర వ్యసనం బారిన పడుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి మళ్లీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. JAN నుంచి ఇలాంటి 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని ‘బ్లడ్ కిక్’ అంటున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, హెపటైటిస్, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం తదితర సమస్యలొస్తాయి. డిప్రెషన్, తనకు తానే గాయపర్చుకునే లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.