News March 30, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@పదవి విరమణ పొందిన ఎస్సై, హెడ్ కాన్స్టేబుల్.. సత్కారించిన అదనపు ఎస్పీ @జిల్లాలో 7 పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ @JGL-KNR కొండగట్టు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి @మొగిలిపేట -నడికుడ గ్రామ సరిహద్దుల మధ్య గొడవ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు @దూలరులో సివిల్ రైట్స్ డే కార్యక్రమం
Similar News
News April 1, 2025
ప.గో: రెండు రోజుల్లో 10 టన్నుల చికెన్ అమ్మకాలు

ప.గో జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో జిల్లాలో 10 టన్నులకు పైగా చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.
News April 1, 2025
KPHBలో సిద్దిపేట యువకుడి సూసైడ్

ప్రేమ విఫలం కావడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. KPHB PS పరిధిలో సోమవారం సాయంత్రం ఈ విషాదం వెలుగుచూసింది. అడ్డగుట్టలోని PG హాస్టల్లో నివాసం ఉంటున్న మహేందర్(25) ఇటీవల జాబ్‌కు రిజైన్ చేశాడు. ‘నేను ప్రేమలో విఫలమయ్యాను. అమ్మా.. నాన్నా క్షమించండి’ అంటూ లెటర్ రాసి ఉరేసుకున్నాడు. మృతుడు సిద్దిపేట జిల్లావాసి.
News April 1, 2025
నేటి నుంచి ఆ ప్రాంతాల్లో లిక్కర్ బ్యాన్

మధ్యప్రదేశ్‌లోని 19 ఆధ్యాత్మిక నగరాలు, పంచాయతీల్లో నేటి నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. JANలోనే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, అమర్కంటక్, మాండ్లేశ్వర్, చిత్రకూట్, పన్నా, మాండ్ల, ముల్తాయ్, మాండసోర్, ఓర్ఛా, మైహర్, దతియా నగరాలు సహా పలు
జీపీల్లో మద్యం షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు.