News March 31, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగ వేడుకలు
@ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.2,22,450 ఆదాయం @కొండగట్టు అంజన్న స్థానాచార్యులకు ఉగాది పురస్కారం @కథలాపూర్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.50వేల విరాళం @పలు మండలాల్లో జింక మల్లన్న స్వామి బోనాలు @మెట్పల్లి: జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జికి సన్మానం @జగిత్యాలలో హనుమాన్ మాలధారుల బైక్ ర్యాలీ @బీర్పూర్లో ఎడ్ల బండి పోటీలు @కొండగట్టులో భక్తుల రద్దీ
Similar News
News April 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 3, 2025
కామారెడ్డి: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: DEO

ఇటీవల ప్రమోషన్ పొందిన GHM, PSHM, SAలకు నిజామాబాద్‌లో శిక్షణ ఉంటుందని DEO రాజు తెలిపారు. ఈ నెల 3న SA (తెలుగు), 4న SA(హిందీ) టీచర్లకు కామారెడ్డి ZPHS బాయ్స్, కృష్ణాజివాడి ZPHSలో శిక్షణ ఉంటుందన్నారు. అలాగే SA (ఉర్దూ) మీడియం టీచర్లకు హైదరాబాద్ TGIRDలో మిగతా ఉర్దూ మీడియం సబ్జెక్ట్స్ టీచర్లకు నిజామాబాద్‌లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని DEO సూచించారు.
News April 3, 2025
బాపట్ల పట్టణంలో క్రైస్తవుల శాంతియుత ర్యాలీ

పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల క్రైస్తవ సంఘాలు నిరసన తెలియజేశాయి. బుధవారం బాపట్ల పట్టణంలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద బైఠాయించారు. ప్రవీణ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయం చేయాలని మృతి పై గల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.