News February 4, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జిల్లా వ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు @ప్రపంచ కాన్సర్ డే.. రన్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ @కొండగట్టులో రథసప్తమి వేడుకల్లో.. భక్తుల సందడి @మెట్పల్లి మిషన్ భగీరథ పైప్‌లైన్ పురోగతి పనులను పరిశీలించిన కలెక్టర్ @జగిత్యాల, మెట్పల్లి లో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం @కథలాపూర్లో రెండో విడత దళిత బంధు అమలు చేయాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం @వెల్గటూరు లో ఎస్సై శ్వేతకు కొవ్వత్తులతో నివాళులు
Similar News
News April 14, 2026
తూ.గో: పుష్కరాల నిర్వహణపై పవన్ దిశానిర్దేశం

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లతో పాటు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పవన్ సూచించారన్నారు.
News April 14, 2026
GNT: రేపు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం

పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో అన్న క్యాంటీన్‌ను రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది. పేదలకు అతి తక్కువ ధరకే కడుపునిండా భోజనం అందించే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తోంది.
News April 14, 2026
రోడ్డెక్కితే భార్యా, పిల్లలు గుర్తుకు రావాలి: ఎస్పీ

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడు తమ భార్యా, పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు రావాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఇతర ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు. విధుల్లో రోడ్లపై పోలీసులు ఉన్నా లేకపోయినా భాద్యతగా రూల్స్ పాటించి భాద్యత గల పౌరులుగా మెలగాలని ప్రతిజ్ఞ చేయించారు.


