News February 11, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్!

image

@పోలీస్ ప్రధాన కార్యాలయంలోని గ్రీవెన్స్ డేలో 11 మంది అర్జీదారులు @మహిళను హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు రూ.25,000 జరిమానా @మల్యాలలో రహదారి పక్కన ప్రమాదకరంగా గుంతలు @మొగిలిపేటలో ప్రమాదకరంగా బ్రిడ్జి పై గుంత @వెల్గటూరులో ప్రమాదకరంగా రోడ్డు @ఎండపల్లిలో ఉరేసుకున్న యువతి @పెగడపల్లిలో రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు

Similar News

News April 5, 2026

నిజామాబాద్: మున్సిపాలిటీల్లో కో- ఆప్షన్ సందడి..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల సందడి మొదలైంది. ఖాళీగా ఉన్న పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ నేతల వద్ద ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయతను ప్రాతిపదికగా తీసుకొని తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు నేతలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు.

News April 5, 2026

కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో అధిష్టానం కీలక నిర్ణయం?

image

తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాల్లో భాగంగా కోమటిరెడ్డి సోదరుల విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో జరగబోయే మార్పుల్లో మంత్రి వెంకటరెడ్డి స్థానంలో సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి పదవి వరించబోతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

News April 5, 2026

కర్నూలు: రూ.9 వేలకు పెరిగిన ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర శనివారం పెరిగింది. క్వింటా రూ.9,079గా నమోదైంది. వారం రోజులుగా రూ.100 చొప్పున పెరుగుతూ వస్తూ నిన్న రూ.9 వేలకు చేరుకుంది. 1,248 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చినట్లు యార్డ్ అధికారులు తెలిపారు. గరిష్ఠ ధర రూ.9,079, మధ్యస్థ ధర రూ.8,742, కనిష్ఠ ధర రూ.4,189కి కొనుగోలు చేశారు.